తరుముకొస్తున్న హమూన్ తుఫాన్.. కేపుపర-చిట్టగ్యాంగ్ మధ్య తీరం దాటే అవకాశం..!

-

బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడింది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫాన్ గా మారింది. తీవ్ర తుఫాన్ కి హమూన్ గా నామకరణం చేశారు. హమూన్ వాయువ్య బంగాళఖాతంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ తాజా అప్డేట్ ప్రకారం.. తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 14 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రేపు సాయంత్రం బంగ్లాదేశ్ కేపుపుర-చిట్టగ్యాంగ్ మధ్య తీరం దాటనుంది తుఫాన్. ఇప్పటికే ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాల వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.

ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆయా రాష్ట్రాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. మరోవైపు తుఫాన్ సూచికగా.. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు విశాక తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లలలో అక్కడక్కడ చెదురు, ముదురు వర్షాలకు ఆస్కారముందని అంచనా వేస్తు

Read more RELATED
Recommended to you

Latest news