నాకు సీఎం కావాలనే కోరిక ఉంది.. కచ్చితంగా అవుతా.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

దసరా ఉత్సవాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం కావాలనే కోరిక ఉంది.. కచ్చితంగా అవుతానని.. వచ్చే పదేళ్లకు ముఖ్యమంత్రిని అవుతా అని.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. దసరా వేడుకల్లో భాగంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇప్పటి వరకు తనను సంగారెడ్డి ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడున్నారని.. వారి దయతోనే తాను ఈ స్థాయికి వచ్చాను అని గుర్తు చేశారు.

విజయదశమి రోజు తన మనస్సులో ఉన్న కోరికను ప్రజలందరి ముందు చెబుతున్నాను అంటూ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే.. మరో పదేళ్లకయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పారు. జగ్గారెడ్డి ఎవరికి ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండడని.. ఇటీవల అందరూ అంటున్న మాటలకు కూడా సమాధానం చెప్పారు. తాను ఫోన్‌లో అందుబాటులో లేకున్నా కూడా నా భార్య, అనుచరులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటారన్నారు. రామాయణంలో శ్రీరామచంద్రునికే నిందలు తప్పలేదు.. ఆప్ట్రాల్ నేనెంత అని అన్నారు జగ్గారెడ్డి. ఈ దసరా అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలన్నారు. వచ్చే దసరా పండుగను కూడా బ్రహ్మండంగా జరుపుకుందాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news