‘హనుమాన్‌’ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌…..

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.

ఇక ఈ చిత్రము ఓటీటీ విడుదల కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారందరికీ ఓ గుడ్‌ న్యూస్‌. త్వరలోనే ఈ బ్లాక్‌ బస్టర్‌ మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 హనుమాన్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్ సొంతం చేసుకుంది.అంతే కాకుండా రిలీజ్‌ డేట్‌ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. మార్చి 2 నుంచే హనుమాన్‌ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.ఇక ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news