ఇస్రో శాస్త్రవేత్తలకు పవన్ కళ్యాణ్ అభినందనలు

-

ఇన్శాట్ 3 డీఎస్ ప్రయోగం విజయవంతం కావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో విజయాలు సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు భారతదేశానికి గర్వకారణమని అన్నారు. ఇస్రో మరెన్నో విజయాలు సాధించాలని, అంతరిక్ష యవనికపై భారత జైత్ర యాత్ర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన ప్రకటన విడుదల చేశారు.

ఇస్రో ఈ ఏడాది రెండో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈరోజు సాయంత్రం 5.35 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్ డౌన్ మొత్తం 27.5 గంటల పాటు కొనసాగింది. కాగా, జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం. ఈ రాకెట్ 19 నిమిషాల్లో నిర్ణీత అంతరిక్ష కక్ష్యకు చేరేలా ప్రణాళికలు రూపొందించగా ,అనుకున్న సమయం ప్రకారమే శాటిలైట్ అన్ని దశలను దాటుకుంటూ విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. ఈ ఉపగ్రహ బరువు 2,275 కిలోలు.

Read more RELATED
Recommended to you

Latest news