కష్టపడితే ఫలితం తప్పక ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం ఉదయం గాంధీ భవన్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనికి టీపీసీసీ చీఫ్ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్.. పేదల దేవాలయం లాంటిదని వివరించారు.
ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.రేవంత్ రెడ్డి సీఎంగా, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా కేబినెట్ మంత్రులు ప్రజా సంక్షేమం కోసం,అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. మనం పండిస్తున్న సన్నబియ్యం ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తున్నామని, విద్య పరంగా చాలా ఆలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు.