హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు

-

టీమిండియా సారధి రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్‌లో 450 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌, దేశవాళీ, ఇంటర్నేషనల్ మ్యాచులన్నీ కలిపి రోహిత్ 450 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. రోహిత్ తర్వాత స్థానంలో దినేష్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ (401), ఎమ్ఎస్ ధోనీ(393), సురేశ్ రైనా(336) ఉన్నారు.

ఇక అంతర్జాతీయ మ్యాచులతో పోల్చి చూస్తే 555 మ్యాచులతో వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ తొలి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో మరో వెస్టిండీస్ ఆటగాడు బ్రావో(552), మూడో స్థానంలో పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్(555), నాలుగో స్థానంలో ఆండ్రె రస్సెల్(540), ఐదో స్థానంలో సునీల్ నరైన్(537) ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version