హార్దిక్ పాండ్యా ఇంట తీవ్ర విషాదం

-

టీమిండియా క్రికెట‌ర్ హార్ధిక్ పాండ్యా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి హిమాన్షు పాండ్యా ఈరోజు ఉద‌యం తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న హిమాన్షు, గుండె పోటుతో ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 నుంచి తప్పుకున్నాడు.

బయో బబుల్ లో ఉన్న ఆయన తండ్రి మరణవార్త విని హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ఈ విష‌యాన్ని జ‌ట్టు యాజ‌మాన్యం మీడియాకు వెల్లడించింది. కృణాల్ నేతృత్వంలోని బ‌రోడా జ‌ట్టు.. ఇప్ప‌టివ‌ర‌కు ముస్తాక్ అలీ టోర్నీలో మూడు మ్యాచ్‌ల‌ను గెలిచింది. ఇక మరో పక్క టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో జ‌రిగే సిరీస్ కోసం ప్రాక్టీసు చేస్తున్నాడు.  ముస్తాక్ అలీ టోర్నీలో హార్ధిక్ ఆడ‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news