దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. వర్చువల్ విధానం ద్వారా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోడీ ప్రారంభించారు.. దేశవ్యాప్తంగా మొత్తం మూడు వేల ఆరు కేంద్రాల్లో టీకా ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రోజు మొత్తం మూడు లక్షల మంది వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ కార్యక్రమం అని అన్నారు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూసింది అని ఆయన పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్ ప్రారంభ కార్యక్రమంలో మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు ప్రధాన మోడీ గుర్తు చేశారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని కవితను తెలుగులో చదివి వినిపించారు మోడీ. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడవోయ్ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పినట్లు పరులకోసం సహాయపడాలని అని పేర్కొన్నారు.