హార్దిక్ పాండ్యా కొడుకు పేరు ఏంటో తెలుసా..!

-

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్, నటాషాలు కొడుకుకు అగస్త్య అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని హార్దిక్ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించాడు. అంతేకాకుండా తన కొడుకు కోసం ఓ బొమ్మ మెర్సిడెజ్ కారును బహుమతిగా పంపిన ఓ కార్ డీలర్ షిప్ కంపెనీకి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. ఇకపోతే ఐపీఎల్ 2020 సీజన్‌కి హార్దిక్ పాండ్యా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే జనవరి 1న నటాషా స్టాంకోవిచ్‌తో కుటుంబ సభ్యుల మధ్య హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పెళ్లి కబురు లేకుండానే మే 31న తాను తండ్రి కబోతున్నట్టు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.

View this post on Instagram

The blessing from God 🙏🏾❤️ @natasastankovic__

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

Read more RELATED
Recommended to you

Latest news