చైతన్య రథం పైనే అంతిమ యాత్ర

-

నాడు చైతన్య యాత్ర.. ఇప్పుడు అంతిమ యాత్ర

నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత చేపట్టిన చైతన్య యాత్రకు ఉపయోగించిన వాహనానికి ‘చైతన్య రథం’ అనే పేరుపెట్టారు. ఆ రథానికి సారధిగా హ‌రికృష్ణ‌ వాహనాన్ని నడిపారు. ఎన్టీఆర్ వెంట దాదాపు 72 వేల కిలోమీటర్లు ఆ చైతన్య రథం పైనే ఎన్టీఆర్ ప్రయాణించారు. దీంతో  ఆ వాహనంతో హ‌రికృష్ణ‌కు విడదీయరాని బంధం ఉంది.. తనకు ఎంతో ఇష్టమైన చైతన్య రథం పైనే రేపు అంతిమ యాత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రస్తుతం నాచారంలోని రామకృష్ణ‌  స్టూడియోలో ఉన్న ఆ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు.

హ‌రికృష్ణ‌ అంత్యక్రియలను మొయినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్ లో చేయాలని తొలుత వార్తలొచ్చాయి.. అయితే కుటుంబ సభ్యుల సమాలోచన తర్వాత జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రేపు సాయంత్రం ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నట్లు నందమూరి కుటుంబ సభ్యులు, మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆయన  వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news