ఈ టైంలో మోహన్ బాబు విలనిజం

-

కలక్షన్ కింగ్ మోహన్ బాబు కెరియర్ పరంగా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారనే చెప్పాలి. యువ హీరోలంతా జోష్ ఫుల్ సినిమాలతో దూసుకెళ్తుంటే తన తనయులిద్దరికి తన నట వారసత్వాన్ని అప్పచెప్పి ప్రశాంతంగా ఉన్నారు మోహన్ బాబు. అడపాదడపా సినిమాలైతే చేస్తున్నా తన మార్క్ చూపించే రోల్స్ మాత్రం రావడం లేదు. గాయత్రి సినిమాలో మోహన్ బాబు నటన బాగున్నా అది ప్రేక్షకులను మెప్పించలేదు.

ఇక ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమాలో నటించబోతున్నాడట మోహన్ బాబు. అది కూడా ప్రతి నాయకుడిగా నటిస్తాడని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ ప్లాన్ చేస్తున్నాడు. సుధ కొంగర డైరక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో విలన్ గా మోహన్ బాబు నటిస్తాడని సమాచారం. ఈ టైంలో విలన్ గా మోహన్ బాబు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు పరిశ్రమలో విలన్ గా కెరియర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారిన మోహన్ బాబు మళ్లీ విలన్ గా మారడం పెద్ద కష్టమేమి కాదు కాని వయసు మీద పడిన ఈ టైంలో విలన్ గా కన్నా సపోర్టింగ్ రోల్స్ బెటర్ అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించిన మోహన్ బాబు విలన్ గా మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కాని ఒకవేళ అదే నిజమైతే సూర్య, మోహన్ బాబుల స్క్రీన్ ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news