25 వేల మెజార్టీతో గెల్లు శ్రీనివాస్ గెలుస్తున్నాడు : హరీష్ రావు

-

25,000 వేల మెజార్టీతో గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యే కాబోతున్నాడని… మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట పట్టణంలో బహిరంగ సభలో మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…పేద ప్రజలను కాపడెది ఎవరు కాల్చుక తినేది ఎవరో ప్రజలు గుర్తించాలన్నారు.

ఈటెల రాజేందర్ ఆరు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టించలేక పోయాడని వెల్లడించారు. ఎన్నికలు ఆయ్యిపోగానే…బిజెపి వాళ్ళు గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెంచుతారని మండిపడ్డారు. బిజెపి గెలిస్తే పెట్రోల్ ధరలు,గ్యాస్ ధరలు తగ్గిస్తామని ఎక్కడ అన్న చెబుతున్నారా ? ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో కేంద్రం వాటా ఉంది అని బిజెపి నాయకులు అవాస్తవాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఈటెల కు ఆత్మగౌరవం లేదు దానిని ఢిల్లీలో ఏనాడో తాకట్టుపెట్టారనీ చురకలంటించారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే జమ్మికుంట లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి ని తొలగిస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news