Jr NTR: తార‌క్ తో బాలీవుడ్ డైరెక్ట‌ర్ మంతనాలు! ఇక పూన‌కాలే..!

-

Jr NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ఇటు వెండి తెర‌పై స్టార్ హీరోగా స‌త్తా చాటుకుంటూనే.. అటు బుల్లి తెర మీద హోస్ట్ గా అలరిస్తున్నాడు. తనదైన మాటలతో బుల్లితెర ప్రేక్ష‌కుల టీవీ ముందు క‌ట్టిప‌డేస్తున్నాడు తారక్. ఇలా బిజి బిజీగా ఉన్న తార‌క్ .. త‌న ఫ్యాన్స్ కి త్వ‌ర‌లో అదిరిపోయే శుభ‌వార్త చెప్ప‌నున్నారు.

ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ తో జూ.ఎన్టీఆర్ క‌లిసి పని చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం. ఆ డైరెక్టర్ ఎవ్వ‌రూ కాదు.. బాజీరావ్ మస్తానీ, పద్మావత్, దేవ‌దాసు వంటి సినిమాను తెర‌కెక్కించిన సంజయ్ లీలా భ‌న్సాలీ తో తార‌క్ క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో టాక్.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నే లేదు. ఆయ‌న పౌరాణిక చిత్రాల‌కి పెట్టింది పేరు. అదే త‌ర‌హాలో ఎన్టీఆర్ కోసం సంజ‌య్ ప్ర‌త్యేకంగా పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశారట. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ ని వెండి తెర మీద చూపించాల‌ని భావిస్తున్న‌డ‌ట సంజ‌య్. అలాగే.. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం ‘జై బావ్ రే’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట. అన్నీ కుదిరి ఈ సినిమా సెట్స్ మీదకొస్తే.. తార‌క్ ఫ్యాన్స్ పెద్ద పండగే.

కాగా, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ వర్క్స్ ఫినిష్ కాగానే కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు.. ఆ వెంటనే ద‌ర్శ‌కుడు ప్రశాంత్‌ నీల్‌ చిత్రాన్ని కూడా ప్రారంభించి ..సరిపడా డేట్స్ ఇచ్చేస్తారట. ఈ రెండు సినిమాలతో పాటు సంజయ్ లీలా భన్సాలీతో.. ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇప్పటికే కథ సిద్ధం చేసిన సంజయ్ లీలా భన్సాలీ.. ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. ఏమ‌వుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news