నిన్న దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే హోరాహోరీ సాగిన ఈ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ గెలుస్తుందని భావించారు. అయితే వెయ్యి ఓట్ల తేడాతో టీఆర్ఎస్ బీజేపీ చేతిలో ఓడిపోయింది. అయితే దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం కొనయిపల్లి గ్రామానికి చెందిన స్వామి నిన్న రాత్రి టిఆర్ఎస్ పార్టీ ఓటమికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు.
ఈ క్రమంలో స్వామి మృత దేహానికి నివాళ్ళు అర్పించిన మంత్రి హరీష్ రావు ఆయన అంతక్రియాల్లో పాల్గొని పాడె కూడా మోశారు. టీఆరెస్ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్న ఆయన ఒడిపోయాం అని టీఆరెస్ కార్యకర్తలు కృంగిపోవద్దని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు అన్నీ తానే అయ్యారు. అభ్యర్ది ప్రకటన మొదలు ప్రచారం చివరి దాకా అన్నీ ఆయనే అయ్యి చూసుకున్నారు.