తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. రాజకీయంగా ప్రస్తుతం బలంగా ఉన్న తెరాస పార్టీ… విపక్షాలకు అసలు అవకాశం ఇవ్వకుండా రాజకీయం చేస్తుంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెరాస విజయం సాధించే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత తెరాస లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.
ఇటీవల కవితకు తెరాస పగ్గాలు ఇస్తారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కెసిఆర్ ఆ పదవి నుంచి తప్పుకుని ఆమెకు అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా మరికోన్ని వార్తలు వస్తున్నాయి. తెరాస లో కీలక మార్పుల దిశగా కెసిఆర్ అడుగులు వేస్తున్నారని అంటున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హరీష్ రావు ని నియమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేటిఆర్ ని ముఖ్యమంత్రిని చేయడానికి గాను ముందు హరీష్ ని సెటిల్ చెయ్యాలి అనే భావనలో ఉన్నారట.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. హరీష్ వెంట సీనియర్లు ఉన్నారనే స్పష్టతకు వచ్చిన కెసిఆర్ ఆయన్ను ఇబ్బంది పెడితే పార్టీ ఇబ్బంది పడుతుందని, అది బిజెపికి అవకాశంగా మారే అవకాశాలు ఉన్నాయని అందుకే హరీష్ ని దూరం ఎలాంటి పరిస్థితుల్లోను చేసుకోవద్దు అనే భావనలో కెసిఆర్ ఉన్నారట. కవితకు పార్టీ పగ్గాలు అప్పగించినా సరే, హరీష్ కి పవర్స్ ఉండే విధంగా చేస్తున్నారట. ఈ విషయంపై ఇప్పటికే చర్చలు కూడా పార్టీలో జరిగాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.