రుణమాఫీ చేస్తామని నమ్మకం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని హరీష్ రావు అన్నారు. శుక్రవారం సిద్ధిపేటలో ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తరపు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని అన్నారు. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ప్రమాణం చేశారని గుర్తు చేశారు.
ఆరు గ్యారెంటీలు, రెండు లక్షల రుణమాఫీ చేస్తే నా రాజీనామా ని స్పీకర్ ఆమోదించాలని కోరారు అలానే మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనని అన్నారు. ఒకవేళ రుణమాఫీ ఆరు గ్యారెంటీలో అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి సిద్ధమా అని అడిగితే నోరు విప్పట్లేదన్నారు హరీష్ రావు ఆ దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అలానే నాకు ఎమ్మెల్యే పదవి కంటే హామీలు అమలు చేయడమే ముఖ్యమని హరీష్ రావు అన్నారు.