వివాదం లో కొడాలి నాని నామినేషన్..!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తకరంగా మారాయి. ఎప్పుడు ఎవ్వరూ ఏ పార్టీలోకి వెళ్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొంత మంది అధికార వైసీపీలోకి వెళ్తుంటే.. మరికొందరూ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నారు. ఇలా వారికి అవకాశాలకు అనుగుణంగా పార్టీలు మారుతున్నారు పలువురు కీలక నేతలు. పార్టీలు మారడమే కాదు.. ఒకరిపై మరొకరూ తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు.

అయితే నిన్నటి వరకు నామినేషన్లను దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన.. ఈనెల 29 వరకు ఉపసంహరణ ఉండటంతో ఆయా పార్టీల నేతలు పలువురు నామినేషన్లను ఉపసంహరించుకునేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ వ్యవహారం ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ పై టీడీపీ నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ లో నాని తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని నాని క్యాంపు ఆఫీస్ గా వినియోగించుకున్నారని, అఫిడవిట్ లో మాత్ర ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని పేర్కొన్నారని వివరించారు. నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని ఆర్వోను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news