కాంగ్రెస్ ఒక్క పంటకే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం : హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేవంత్ కు మతిమరుపు వచ్చినట్టుందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తాజాగా ఆయన సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం షరతులు పెట్టి చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారని.. రైతు భరోసా విషయంలో పది ఎకరాలకే ఇస్తాం, ఒక్క పంటకే ఇస్తామని ప్రభుత్వం లీకులు చేస్తోందని ఆరోపించారు. కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుస్తీ పడుతోందని తెలిపారు.

రైతులకు అన్యాయం చేస్తే రైతు లోకం తిరగబడుతుందని హెచ్చరించారు హరీశ్ రావు. రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు పెట్టండని మళ్లీ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒక్కసారే రైతు భరోసా ఇస్తే.. లక్షలాది మందికి అన్యాయమే అని పేర్కొన్నారు. రైతుల గౌరవం పెరిగేలా బీఆర్ఎస్ కృషి చేసిందని తెలిపారు. రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను నిలుపుకుందా.? అని ప్రశ్నించారు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news