ఉస్మానియా ఆసుపత్రిలో మూడు పూటలా భోజన పథకాన్ని ప్రారంభించిన హరీష్ రావు

-

హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగి సహాయకులకు రూ. 5 రూపాయలకే భోజన సౌకర్యాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ గొప్ప మానవతావాది అని, మానవత్వానికి మారుపేరు అంటూ కొనియాడారు. రాష్ట్రం ఏర్పాటై టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే మానవతా దృక్పథంతో పేదలందరికీ రూ.1 కిలో చొప్పున, ఒక్కొక్కరికి ఆరు కేజీలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ అని అన్నారు.

మన రాష్ట్రంలో పండిన పంటను ఇస్తున్నారని, పేదలు కడుపునిండా తినాలని ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5 కు మూడు పూటలా భోజనం ప్రారంభించామన్నారు. ఇందుకుగాను రూ 40 కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుందని హరీష్ రావు తెలిపారు. ఒకవేళ ఖర్చులు పెరిగినా కూడా ప్రభుత్వం భోజనం పెట్టేందుకు వెనుకాడని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. హరే కృష్ణ వారి సహకారంతో భోజనం ప్రారంభించామని, వారికి రూ. 21 రూపాయలు ప్రతీ పూటకి ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news