ఒకప్పుడు సిద్ధాంతాలు.. ఇప్పుడు చిల్లర రాద్ధాంతాలు..

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవలే పటాన్చెరు మండలం లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో టిఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే తప్పుడు ప్రచారం చేస్తూ బిజెపి రాద్ధాంతం చేస్తుంది అంటూ మండిపడ్డారు. బిజెపి అంటే ఒకప్పుడు సిద్ధాంతాల పార్టీ అని నమ్మే వాడిని కాని ప్రస్తుతం మాత్రం బీజేపీ అంటే ఓట్ల కోసం చిల్లర రాద్ధాంతాలు చేసే పార్టీ గా మారిపోయింది అంటూ ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు.

ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల కోసం అసత్య ప్రచారాలు చేసి ఎదగాలని భావిస్తోంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపు కోసం కార్యకర్తలందరూ గడపగడపకు వెళ్లి ప్రచారం చేయాలని టిఆర్ఎస్ చేపడుతున్న పనులన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావ్. ఇక బీజేపీ కాంగ్రెస్ లో చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహా మరికొంతమంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.