మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలవాలా? రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవాలా? – హరీష్‌ రావు

-

మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలవాలా? రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవాలా? అని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలపై హరీష్‌ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ కు మునుగోడు పై ప్రేమ ఉంటుందా? మోడీకి ఉంటుందా? అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను బీజేపీ అవమానపర్చిందని.. బీజేపీ ప్రభుత్వం వచ్చి ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని చెప్పారు.

కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చాలని కోరితే ఇప్పటి వరకు కేంద్రం పట్టించుకోవడం లేదని.. వాటా తేల్చకుండా నల్గొండకు తీరని అన్యాయం చేసింది కేంద్రమని వెల్లడించారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చని బీజేపీకి మునుగోడులో ఓటు అడిగే హక్కు ఎక్కడిదని.. కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని ఆగ్రహించారు.

కాళేశ్వరం తొలి ఫలితాలు నల్గొండ జిల్లాకే అందింది… నల్గొండ జిల్లాలో 5 లక్షల కరెంటు మోటార్లు ఉన్నాయి. ఉచిత విద్యుత్ వల్ల ఎక్కువ లాభపడింది కూడా నల్గొండనేన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు అన్నారు. రాజగోపాల్ రెడ్డి గెలిచినా మునుగోడులో చేసేదేమీ లేదు. కేసీఆర్ ను, టిఆర్ఎస్ ప్రభుత్వం ను దూషించడంమే ఆయన పని అని ఆగ్రహించారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news