లే అవుట్ రెగ్యులేషన్స్ స్కీం పై తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం మీద మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కి అలవాటుగా మారిపోయింది అన్నారు. అధికారం లోకి రాగానే LRS రద్దు చేస్తామని ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని నేడు మాట తప్పిందని అన్నారు. ఎల్లారెస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైంది.
నో ఎల్ఆర్ఎస్ నో బి ఆర్ ఎస్ అని గతంలో ప్రజల్ని రెచ్చగొట్టి ఇప్పుడు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకి నిదర్శనమని హరీష్ రావు అన్నారు. గతంలో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా LRS ని ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలి లేకపోతే మోసపూరిత హామీ ఇచ్చినందుకు క్షమాపణలు చెప్పాలి అని హరీష్ రావు అన్నారు.