మార్చి 10న కరీంనగర్ లో కేసీఆర్‌ సభ

-

మార్చి 10న కరీంనగర్ లో కేసీఆర్‌ సభ ఉండనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే… మార్చి 10న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో సభ ఉండనుంది. ఇక ఈ సభకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారని కేటీఆర్‌ వెల్లడించారు.

KCR reached Telangana Bhavan

మేడిగడ్డకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తాం అంటే వెంట తీసుకెళ్తామని పేర్కొన్నారు కేటీఆర్‌. మార్చి 1న ఛలో మేడిగడ్డ కార్యక్రమం చేపడతామని ప్రకటన చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అందరం కలిసి వెళతామని.. తెలంగాణ భవన్ నుంచి 150 మంది ప్రజా ప్రతినిధులందరం మేడిగడ్డ బయలుదేరి వెళతామని ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాకా నీళ్ల కోసం పోరాటం చేయాల్సి వచ్చిందని…ఎన్ని పోరాటాలు, ఉద్యమాలు చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు తెలంగాణ కు దక్కలేదని ఫైర్ అయ్యారు. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని…తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే జల యజ్ఞం పేరుతో దన యజ్ఞం చేశారని కాంగ్రెస్‌ పై నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news