వరంగల్ లో హరీష్ రావు పర్యటన..సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణలపై కీలక ఆదేశాలు

-

వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మిస్తున్న 24 అంతస్థుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణలను మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 24 అంతస్తుల భవనంలోని 16 అంతస్థుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు.

మిగిలిన 8 అంతస్తుల్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఆస్పత్రి నిర్మాణం చేపడతామని వెల్లడించారు. హెలికాప్టర్ అంబులెన్స్ సేవల కోసం అనుమతులు లభించాయన్నారు. 12 నెలల్లోగా ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం 750 మంది కార్మికులతో పనులు సాగుతున్నాయని.. 2500 మందితో చేపట్టి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీష్‌ రావు. ఈమద్య లో స్టాఫ్ రిక్రూట్మెంట్, పరికరాలు సమకూర్చుకుంటామని.. వరంగల్ లో అతి త్వరలో అత్యాధునిక వైద్యసేవలు అనుబాటులోకి రానున్నాయన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news