ఎన్టీఆర్‌కు ప్లాప్ ఇచ్చాడు… ఇప్పుడు రుణ‌ప‌డ్డానంటున్నాడు

-

షాక్ – మిరపకాయ్ –  గబ్బర్ సింగ్ – డిజె లాంటి సినిమాలు తెరకెక్కించిన హరీష్ శంకర్ తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వాల్మీకి సినిమాను తెరకెక్కించాడు. కోలీవుడ్‌లో సిద్ధార్థ హీరోగా నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన జిగర్‌తండా రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 20న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్లు స్పీడ‌ప్‌ చేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు హరీష్ శంకర్ పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రెబల్ స్టార్ ప్రభాస్ -యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమాపై కూడా కామెంట్ చేశాడు. ఇండస్ట్రీలో ఎవరికైనా రుణపడి ఉన్నా అన్న భావన కలిగిందా ? అన్న ప్రశ్నకు హరీష్ చాలా తెలివైన ఆన్సర్ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ కు తాను చాలా రుణపడి ఉన్నానని… ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయాను అని చెప్పాడు.


ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ తో ఒక హిట్ మూవీ తీసి ఆయన రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నట్టు హరీష్ తన మనసులో మాట చెప్పాడు. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీశాక హ‌రీష్‌పై నమ్మకంతో ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తే రామయ్య వస్తావయ్యా సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా చేసి హిట్‌ ఇవ్వాలని హరీష్ ఫిక్స్ అయ్యాడు.

డీజే సినిమా త‌ర్వాత ఛాన్స్ కోస‌మే ఆప‌సోపాలు ప‌డ్డ హ‌రీష్‌కు ఎట్ట‌కేల‌కు వాల్మీకి ఛాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా రిజ‌ల్ట్‌పైనే హ‌రీష్ ఫ్యూచ‌ర్ డిసైడ్ అయ్యి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news