తెలంగాణలో రేపటి నుంచి హరితహారం..20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం..

-

తెలంగాణలో రేపటి నుంచే ఏడవ విడత-హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఏడవ విడత హరితహారంలో 20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. 2015 లో ప్రారంభమైన ఈ హరితహారం.. 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించటమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం నర్సరీల సంఖ్య 15,241కు పెరగగా..అందుబాటులో ఉన్న మొక్కల సంఖ్య సుమారు 25 కోట్లుగా ఉంది. ఈసారి బహళ రహదారి వనాలకు (మళ్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్) ప్రాధాన్యత ఇవ్వనుంది సర్కార్. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయతీ రోడ్ల వెంట బహుళ వనాలు నాటే కార్యక్రమాన్ని ఈ సారి చేపట్టనున్నారు.

వీలున్న ప్రతీ చోటా యాదాద్రి (మియావాకీ) మోడల్ లో చెట్లు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని.. ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ, పెంచే బాధ్యత ఆయా కుటుంబాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలనే లక్ష్యంగా ముందుకు పోవాలని… జులై 1 నుంచి 10 దాకా పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై రాష్ట్ర మంతటా స్పెషల్ డ్రైవ్ చేయనుంది సర్కార్.

ప్రతీ ప్రాంతంలో అటవీ భూముల గుర్తింపు, అటవీ పునరుద్దరణకు చర్యలు తీసుకోనుంది. అటవీ బ్లాకుల వారీగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అటవీ పునరుద్దరణ ప్రణాళికలు చేపట్టనుంది. పటిష్ట చర్యలు, పర్యవేక్షణ ద్వారా అటవీ భూములు, సంపద రక్షణ చేస్తున్న సర్కార్… ఇప్పటికే గ్రీన్ బడ్జెట్ నిధులను విడుదల చేసింది. మొక్కలు నాటే మిగతా శాఖలకు సాంకేతిక సహకారం ఇవ్వనుంది అటవీ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news