యూత్ ఏం చేయకూడదు : హర్ష్ గోయెంకా ఆసక్తికర సూచనలు

-

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా ట్విటర్‌ ద్వారా జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన సూచనలు చేశారు. రామ ప్రసాద్ గోయెంకా గ్రూప్ కు చైర్మన్ అయిన ఆయన యుక్త వయసులో ఉన్నవారు తాను చెప్పే ఆరు సూత్రాలు పాటిస్తే జీవితంలో ఉన్నతస్థానంలో ఉంటారని గోయెంకా పేర్కొన్నారు. ఆయన చెప్పిన ఆరు సూత్రాలు ఏంటంటే..1 ‘అప్పులకు దూరంగా ఉండండి…2 పేరు ప్రఖ్యాతలను సంపాదించగల నైపుణ్యాలు ఏవో గుర్తించండి. 3 సోషల్ మీడియాను తెలివిగా వాడుకోవడం నేర్చుకోండి 4 టార్గెట్‌ను రీచ్‌ అయ్యేందుకు ప్రయత్నించండి.. 5 ఇతరుల అభిప్రాయాల గురించి బాధపడకండి…6 నేర్చుకోవడం లేదా అనుభవాల మీద దృష్టి పెట్టండి’ అంటూ ఆరు సూత్రాలను చెప్పుకొచ్చారు.

అంతే కాక కుర్ర వాళ్ళ నుండి మనం ఏమేం నేర్చుకోవచ్చో చూడండి అంటూ మరో ఆరు సూత్రాలు తెలిపారు. 1. యువత కొత్త విషయాలను నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. 2. కొత్తవారిని ఈజీగా ఫ్రెండ్స ని చేసుకుంటారు. 3. తమ గోల్ కోసం ఎంతదూరమైనా వెళతారు. అంతేకాదు ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తారు. 4. ఇతరులు ఏమనుకుంటున్నారో అస్సలు పట్టించుకోరు. 5.చేస్తున్న పనిలోనే సంతోషాన్ని వెతుక్కుంటారు, చాలా సంతృప్తిగా ఉంటారు. 6. కక్షలు కార్పణ్యాలు లాంటి వాటి జోలికి వెళ్లరు. 

 

 

Read more RELATED
Recommended to you

Latest news