కొల్లాపూర్ టీఆర్ఎస్ లో ముసలం..హర్షవర్ధన్‌,జూపల్లి హౌజ్‌ అరెస్ట్‌ !

-

కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ముసలం నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి పై బహిరంగ చర్చ కు నేడు సవాళ్లు- ప్రతి సవాళ్లు చేసుకున్నారు జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డిలు.

అంబెడ్కర్ చౌరస్తా లో చర్చకు రావాలన్న జూపల్లి… మీ ఇంటికే వస్థానని హర్షవర్ధన్ ఛాలెంజ్‌ చేశారు. అయితే… వీరికి అనుమతి నిరాకరించారు పోలీసులు. ఇద్దరి ఇండ్ల వద్ద పోలీసులు మోహరించి..జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డి లను హౌస్ అరెస్ట్ చేశారు.

అంబేద్కర్ చౌరస్తా లో చర్చకు కాకుండా నా ఇంటికే వస్తా అని హర్షవర్ధన్ అన్నాడు… అందుకే వేచి చూస్తున్నా అంటూ సందర్భంగా జూపల్లి పేర్కొన్నారు. నా మీద విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకే బహిరంగ చర్చ సవాల్ విసిరాను. కొల్లాపూర్ లో ప్రాబల్యం ఉందో ప్రజలకు తెలుసు అని వెల్లడించారు జూపల్లి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version