భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ మూడవ దశ హ్యూమన్ ట్రయల్స్ నవంబర్ 20 న హర్యానాలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో హర్యానా కేబినేట్ మంత్రి అనీల్ విజ్ బుధవారం ఒక కీలక ప్రకటన చేసారు. భారత్ బయోటెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవాక్సిన్ యొక్క మూడవ దశ ట్రయల్స్ కోసం తాను మొదటి వాలంటీర్ గా ఉండటానికి ముందుకొచ్చానని ఆయన పేర్కొన్నారు.
నవంబర్ 20 న హర్యానాలో ప్రారంభం కానున్న ఈ ట్రయల్స్ కి తాను సిద్దంగా ఉన్నా అన్నారు. అయితే దీనిపై ఇంకా అధికారులు స్పందించలేదు. ఇక ఇదిలా ఉండగా ఢిల్లీలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం హర్యానా నుంచి వస్తున్నాయని ఢిల్లీ సర్కార్ పేర్కొంది.