పవన్ ప్రాపర్టీ పై ఎన్టీఆర్ కన్ను పడిందా.. అసలు విషయం ఏమిటంటే..?

-

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవరా.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కొరటాల శివ ఆచార్య సినిమాతో భారీ అట్టర్ ప్లాఫ్ ను మూటగట్టుకున్నాడు. ఇకపోతే ఇప్పటికే కొరటాల శివ ,ఎన్టీఆర్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆలోచనతోనే అభిమానులు కూడా ఈసారి ఈ కాంబో తప్పకుండా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు రాజమౌళితో చేసిన సినిమా తర్వాత ఏ హీరో ఏ సినిమా చేసినా.. అది డిజాస్టర్ అవుతుందనే సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి ఎన్టీఆర్, కొరటాల శివ చాలా కష్టపడుతున్నారు. అనేక సార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఈ మధ్యనే అధికారికంగా లాంచ్ చేశారు . హైదరాబాదులో సినీ పెద్దల సమక్షంలో పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ప్రశాంతి నీళ్ కెమెరా ఆన్ చేయగా.. రాజమౌళి ఎన్టీఆర్, జాన్వి కపూర్ ల తొలి ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టి మరీ షూటింగ్ ప్రారంభించారు.

ఇకపోతే సినిమా కథ గురించి కొరటాల శివ చెబుతూ దేవుడంటే భయం లేదు.. కానీ మృత్యువంటే భయం లేని వారు కూడా ఎన్టీఆర్ చూసి భయపడతారు.. సముద్ర తీరాన ఉండే ప్రజలంతా దేవరగా భావించే ఒక దేవుడు కొండపైన ఉంటాడు. తప్పు చేసిన వాళ్లను కొండపై ఉండే దేవర శిక్షిస్తాడని అక్కడివాళ్లు ఆ దేవరకే భయపడతారన్నది సినిమా కథగా చెబుతున్నారు .ఈ నేపథ్యంలోని ఈ సినిమాకి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ దేవర అనే పదం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ చాలా సందర్భాలలో కామెంట్లు కూడా చేశాడు. అంతేకాదు పవన్తో తీయబోయే తన సినిమాకు ఇదే టైటిల్ పెడతానని కూడా చెప్పాడు. మరి ఈ విషయంపై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news