పిల్లల్ని కనండి.. తమిళ ప్రజలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి..!

-

లోకసభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే.. రాష్ట్రం  లో లోక్సభ స్థానాలు తగ్గుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా మరోసారి స్పందించిన స్టాలిన్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పునర్విభజన  తో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు.

నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ  ఈ అంశాన్ని ప్రస్తావించారు స్టాలిన్. “నవ దంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో నేనే చెప్పా. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోన్న వేళ ఇప్పుడలా చెప్పలేను. అంతకుముందు మేం కుటుంబనియంత్రణపై దృష్టిసారించాం. కానీ ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాం. అందుకే నేను కోరుకునేది ఒక్కటే కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టండి” అని సీఎం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news