ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికీ ముఖ్య గమనిక. అయితే ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండటం వల్ల పలు నష్టాలు ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ ఉంటే కచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు అనుసరించాలి. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ కలిగి లేకపోతే చార్జీలు చెల్లించుకోవాలి. అలాగే ఇతర చార్జీలు కూడా భరించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు చార్జీలు, ఎస్ఎంఎస్ చార్జీలు ఇలా పలు రకాల చార్జీలు పడతాయి.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు మీరు ఎన్ని అకౌంట్లు కలిగి ఉన్నారో అన్నింటి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. వాటి స్టేట్‌మెంట్ తీసుకోవడం చాలా కష్టమైన పని. అలాగే మీరు నాలుగు బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారని భావిస్తే.. ప్రతి అకౌంట్‌లోనూ మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. దీనిపై వచ్చే వడ్డీ దాదాపు 3 శాతం ఉండొచ్చు. అదే మీరు అకౌంట్లు అన్నీ క్లోజ్ చేసుకొని ఆ డబ్బులను మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే 10 శాతం రాబడి పొందొచ్చు.