ఈ స్టార్ హీరోల మధ్య ఉన్న పోలికలు ఎప్పుడైనా గమనించారా..?

-

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రమేష్ బాబు, జగపతి ఆర్ట్ అధినేత ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ వారసుడిగా జగపతి బాబు ఇలా ముగ్గురు కూడా హిందీలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పైగా యాదృచ్చికంగా దర్శకుడు వి.మధుసూదనరావు చేతులమీదుగా ఈ హీరోలు ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఇకపోతే వీరి ముగ్గురిలో నాగార్జున , జగపతిబాబు హీరోలుగా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే కృష్ణ తనయుడు రమేష్ బాబు ఒక వెలుగు వెలిగినా ఆ తర్వాత హీరోగా సక్సెస్ కాలేకపోయారు.

ఇటీవల కాలంలో హఠాన్మరణం చెంది..అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఆయన . ఇక అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన వెలుగునీడలు, సుడిగుండాలు సినిమాలో బాలనటుడిగా నటించిన నాగార్జున , ఆ తర్వాత హిందీలో జాకీష్రాఫ్, మీనాక్షి శేషాద్రి హీరోహీరోయిన్లుగా సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన హీరో సినిమాకి రీమేక్ గా 1986లో విక్రమ్ మూవీ తో హీరో అయ్యారు నాగార్జున.

ఇక బాలనటుడిగా నటించిన అనుభవం కారణంగా రమేష్ బాబు 23 ఏళ్ల వయసులో సామ్రాట్ మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రమేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమయంలో ఎన్టీఆర్ , కృష్ణ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఇకపోతే హిందీ లో సన్నీ డియోల్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా బేతాబ్ ను తెలుగులో రీమేక్ గా సామ్రాట్ పేరుతో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాకి రాజేంద్రసింగ్ బాబు మొదటి షెడ్యూల్ పూర్తి చేయగా.. ఇక డబ్బులేక ఆగిపోవడంతో సీనియర్ దర్శకుడు మధుసూదన్ రావు డైరెక్ట్ చేసి విజయం సాధించారు. ఇక జగపతి బాబు కూడా ఖత్రోం కే ఖిలాడి సినిమాకి రీమేక్ గా సింహ స్వప్నం సినిమాను తెలుగులో తెరకెక్కించారు. ఇందులో జగపతిబాబు ద్విపాత్రాభినయం చేసినా కూడా ఈ సినిమా హిట్ అవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news