HBD Varma: సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విడుదల కాకున్నా.. ఆయన సినిమాలలో నటించకపోయిన సరే నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. సాధారణంగా తమ గురించి అందరూ మాట్లాడుకోవాలని ఆశించే వారు అధికంగా ఉంటారు కానీ అందుకోసం ఏం చేయాలో తెలియదు కానీ తెలివైన వారు మాత్రం ఏదో విధంగా తాము తరచు వార్తల్లో ఉండేలా చూసుకుంటారు. అలాంటి వారిలో రాంగోపాల్ వర్మ కూడా ఒకరు.
ఒకప్పుడు తన వైవిధ్యమైన డైరెక్షన్ తో అందరినీ ఆకట్టుకున్న రాంగోపాల్ వర్మ గత కొన్ని సంవత్సరాలుగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. దాంతో మునుపటి వైభోగం ఆయనకు కరువైందని చెప్పాలి. అప్పట్లో రాంగోపాల్ వర్మ అనగానే రియల్ క్రియేటర్ అంటూ ప్రతి ఒక్కరూ కీర్తించారు . వర్మ చెయ్యి తాకితే చాలు అన్నట్టు అభిమానులు కూడా సాగారు. ఒక స్టార్ హీరో మించి ఇమేజ్ను ఆయన సొంతం చేసుకున్నారు. ఇకపోతే 2005లో తెరకెక్కించిన సర్కార్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు అన్నది నిర్వివాదాంశం.
శివ సినిమాతో తనదైన బాణీ పలికిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు వర్మ . ఆ చిత్రం హిందీ రీమేక్ తో ఉత్తరాదిని సైతం తనదైన శైలిని ప్రదర్శించారు. ఆ తర్వాత గ్యాంగ్ వార్స్ అన్నా.. దెయ్యాలతో భయపెట్టడం అన్న వర్మకు మహా ఇష్టం తరచూ ఈ రెండు జానర్ లోని సినిమాలు తీస్తూ వచ్చారు. ఇక టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే వర్మ కథను పరిగెత్తించే విధానానికి ప్రతి ఒక్కరు ఫిదా ఎవరు. ఇక వర్మ తెలుగులో రూపొందించిన గోవింద చిత్రం విషయంలో అప్పటి ప్రాంతీయ సెన్సార్ ఆఫీసర్ తమ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత తెలుగు చిత్రాలు తీయనని భీష్మించారు వర్మ. ఇక ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలకే పరిమితమైన ఆయన అక్కడ సత్య, రంగీలా, కంపెనీ,సర్కార్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడేమో అడల్ట్ సినిమాలు తీస్తూ ఉన్న పరువును కాస్త పోగొట్టుకున్నారు. మరి మళ్లీ ఆయన తిరిగి పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటారా లేదా అని.. అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి అభిమానులు, ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.