అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-

బ్రహ్మానందంలోని అసలైన నటుడిని నిద్రలేపిన సినిమా.. ప్రకాశ్ రాజ్​లోని నట రాక్షసత్వాన్ని మరోసారి నిరూపించిన మూవీ.. రమ్యకృష్ణతో మరోసారి ప్రేక్షకులను కంటతడి పెట్టించిన చిత్రం.. రంగమార్తాండ. ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమా ఇది. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసిందీ చిత్రం.

మరాఠీ సినిమా ‘నట సామ్రాట్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. గత నెలలో థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ అందుకున్న ఈ సినిమా.. ఎలాంటి ప్రచారం లేకుండా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేటి నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

స్టోరీ ఏంటంటే.. రంగ‌స్థలంపై ఎన్నో పాత్రల‌కి జీవం పోసి ర‌క్తి క‌ట్టించిన న‌టుడు రాఘ‌వ‌రావు (ప్రకాశ్‌రాజ్‌). నాట‌క‌రంగ‌మే ప్రపంచంగా బ‌తికిన ఆయ‌న‌కి రంగ‌మార్తాండ అనే బిరుదుని ప్రదానం చేస్తారు. ఆయ‌న స్నేహితుడు చ‌క్రపాణి (బ్రహ్మానందం) కూడా రంగ‌స్థల న‌టుడే. ఇద్దరూ క‌లిసి దేశ విదేశాల్లో ప్రదర్శన‌ల‌తో ప్రేక్షకుల నీరాజ‌నాలు అందుకున్నవారు. జీవితంలో పరస్పరం క‌ష్టసుఖాల్లో పాలు పంచుకున్న వారు. రంగ‌మార్తాండ బిరుదుతో త‌న‌ని స‌త్కరించిన వేదిక‌పైనే నాట‌క రంగం నుంచి నిష్క్రమించి త‌ను సంపాదించిందంతా వార‌సుల‌కి క‌ట్టబెడ‌తాడు రాఘ‌వరావు. అక్కడి నుంచి ఆయ‌న జీవితంలో కొత్త చాప్టర్ మొద‌ల‌వుతుంది. ఆ చాప్టర్​లో ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? రంగ‌స్థలంపై ప్రతిపాత్రనీ ర‌క్తి క‌ట్టించిన రాఘ‌వ‌రావుకి నిజ జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమించాడా..? అనే ఆసక్తికర అంశాలతో ఇది తెరకెక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news