అకౌంట్లలో కోట్లలో డబ్బులు జమ… హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకులో సాంకేతిక లోపం

-

హెడీఎఫ్సీ బ్యాంకులో సాంకేతిక లోపంలో పలువురు ఖాతాదారుల ఎకౌంట్లలో కోట్లలలో డబ్బుల జమ అయ్యాయి. 100 మందికి పైగా ఖాతాదారుల ఎకౌంట్లలో 13 కోట్ల చొప్పున జమ చేసింది సిబ్బంది. ఈ ఘటన చెన్నైలోని త్యాగరాయనగర్ బ్యాంచ్ లో జరిగింది. టెక్నికల్ ఇష్యూ కారణంగానే రూ.13  కోట్లు వందల ఎకౌంట్లలో పడ్డాయిని చెబుతున్నారు బ్యాంకు అధికారులు. ఒక్కసారిగా ఇంత డబ్బు తమ అకౌంట్లో జమయ్యే సరికి ఖాతాదారులు షాక్ అయ్యారు. 

వికారాబాద్ జిల్లాకు చెందిన చిరు వ్యాపారి వెంకట్ రెడ్డి హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ఖాతాలో 18 కోట్ల 52 లక్షలు జమయ్యాయి. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపారు. దీంతో ఆయన ఎకౌంట్ ఫ్రీజ్ చేశారు. కొత్త సాఫ్ట్ వేర్ అప్డేడ్ చేసే క్రమంలో ఇలా జరిగిందని చెబుతున్న బ్యాంకు అధికారులు. ఇలాగా పెద్దపల్లి జల్లాలో కూడ కొంత మంది ఎకౌంట్లలో డబ్బు జమయ్యాయి. పెద్దపెల్లికి చెందిన ఓ మొబైల్ షాప్ యజమాని అకౌంట్ లో రూ. 5.8 కోట్ల డబ్బు జమ అయింది. దీంతో ఆ ఎకౌంట్లను ఫ్రీజ్ చేశారు బ్యాంకు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news