ఏపీ రాజకీయా్లో అయ్యన్న పాత్రుడి కామెంట్లు అగ్గిరాజేసిన విషయం తెలిసిందే. ఆయన సీఎం జగన్ మోహన్‌రెడ్డి మీద చేసిన కామెంట్లతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక దీనికి నిరసనగా వైసీపీ నేతలు ఎమ్మెల్యే జోగి నేతృత్వంలో ఏకంగా మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపైకి వెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేలా చేశాయి. కాగా దీనిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓరేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఒక సీఎంను పట్టుకుని ఇలా అంటారా అని విమర్శించారు.
కాగా అయ్యన్న పాత్రుడు ఈ విమర్శలపై స్పందించారు. వైసీపీ సమాధానం చెప్పలేని విధంగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు. తాను తన వ్యాఖ్యల ద్వారా సీఎం జగన్‌ను అసభ్యకరంగా మాట్లాడలేదని, తాను గౌరవంగానే వ్యాఖ్యానించారు. సీఎం జగన్ చర్చికి వెళ్తే అక్కడ ఉండే ఫాదర్ ఎలాగైనా ఓ మై సన్” అని అంటారో అదే విధంగా తాను కూడా సంబోధించాను తప్ప అగౌరవంగా మాట్లాడలదేన్నారు.
ఆ మాటలు ఇప్పుడు ఏపీ కేబినెట్ లో మంత్రులు కూడా మాట్లాడుతున్నారని, వాటినే తాను కూడా చెప్పానని వ్యాఖ్యానించారు. దీంతో వీటికి సమాధానం చెప్పడం వైసీపీకి కష్టమే అని తెలుస్తోంది. ఎందుకంటే జగన్ ఎలాగూ చర్చికి వెళ్తారు కాబట్టి దాన్ని కాదనలేం. దీంతో అయ్యన్న కౌంటర్ పై ఎలాంటి స్పందన చేసినా చివరకు అది తమను ఇరకాటంలో పడేస్తుందని వైసీపీ భావిస్తోంది. ఇక చంద్రబాబు ఇంటిని ముట్టడించడంపై కూడా అయ్యన్న పాత్రుడు గట్టి కౌంటర్ వేశారు. దీన్ని ప్రజాస్వామయ్యంపై దాడిలాగా చూడాలన్నారు.