చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లి లోని ఆయన ఇంటి వద్ద.. ఉదయం నుంచి వైసీపీ నేతలు హల్చల్ సృష్టించారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో… టిడిపి నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల కు నిరసనగా వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ మరియు వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు ఇంటి ముందు బైఠాయించారు.

chandrababu

దీంతో టిడిపి మరియు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల నినాదాలతో తోపులాట చోటుచేసుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు ప్రయత్నించే క్రమం లో లాఠీఛార్జి కూడా చేశారు పోలీసులు. అయితే ఈ ఆందోళన నేపథ్యంలో ఎమ్మెల్యే జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తత గానే ఉంది. అటు ఈ ఘటన పై చంద్రబాబు ఆరా తీశారు.