రాజద్రోహం కేసులు పెడతాం : రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్

రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ కు అంబాసిడర్ అని అంటారా..నాకు డ్రగ్స్ కు సంబంధం ఏంటి.. ? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ని పట్టుకొని తాగుబోతు అంటారా.. సున్నాలు వేసుకునే వాళ్లు.. కన్నాలు వేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇలాగే వ్యవహరిస్తే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు కేటీఆర్. తెలంగాణా భవన్ లో మంత్రి కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు.

రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR
రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను అన్ని డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సిద్ధమని.. రాహుల్ గాంధీ సిద్ధమా.. ? అని సవాల్ విసిరారు. వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు.. నోటికి వచ్చినట్టు వాగడం తప్ప ఎం లేదని.. మల్లారెడ్డి సవాలుకు భయపడి పారిపోయాడని చురకలు అంటించారు. కేసీఆర్ పుట్టినప్పుడే వందల ఎకరాలున్నాయని.. బ్లాక్ మెయిల్ తో రేవంత్ పైసలు సంపాదిస్తున్నాడని నిప్పులు చెరిగారు. పిసిసి కొనుకున్నోడు, టికెట్లు అమ్ముకోడా.. ? అని ప్రశ్నించారు.