నిజమేంటో అందరికీ తెలియాలనే అలా చేశా: హనుమ విహారి

-

ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనంటూ భవిష్యత్తులో ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడబోనని సీనియర్ క్రికెటర్ హనుమ విహారి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.ఏ తప్పు చేయకపోయినా తనను ఆంధ్రా జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించారని క్రికెటర్ విహారి ఆరోపించారు. ‘నేను ఎవరినీ అసభ్య పదజాలంతో తిట్టలేదు అని తెలిపారు. టీమ్ లో 17వ ప్లేయర్ గా ఉన్న వ్యక్తి.. రూల్స్ ప్రకారం డ్రెస్సింగ్ రూమ్ కి రాకూడదు. కానీ అతడు వచ్చాడు. దీని గురించి వారించినందుకు అతడు, అతడి తండ్రి.. నేనే తప్పు చేసినట్లుగా చిత్రీకరించారు. ప్రజలకు నిజం తెలియాలనే దీనిపై పోస్ట్ పెట్టాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇక విహారి పోస్టు వైరల్‌ అయిన తర్వాత పృథ్వీరాజ్‌ ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. ‘అందరికీ హలో.. మీరు కామెంట్‌ బాక్స్‌లలో వెతుకుతున్న క్రికెటర్ నేనే. అతడు చెప్పింది అబద్ధం. నాపై అసభ్య పదజాలం సరికాదు అని అన్నాడు. నువ్వు ఇంతకు మించి ఏం పీకలేవు మిస్టర్ సో కాల్డ్ ఛాంపియన్’ అని ఇన్స్టాలో స్టోరీ పెట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news