పబ్ జీ కోసం ఫోన్ ఇవ్వలేదని, రాళ్ళతో కొట్టి చంపేసాడు…!

రాజస్థాన్ రాజ్‌ సమండ్‌ లో ఒక దారుణం జరిగింది. పబ్ జీ ఆడటానికి తన ఫ్రెండ్ ఫోన్ ఇవ్వలేదు అని ఒక బాలుడు తన ఫ్రెండ్ ని రాళ్ళతో కొట్టి చంపేసాడు. హత్య చేసిన బాలుడి వయసు 14 ఏళ్ళు. పోలీసులు వెల్లడించిన వివారాల ప్రకారం చూస్తే… నవంబర్ 9 న రాజస్థాన్ లోని రాజ్సమండ్ జిల్లాలోని జైట్పురా ప్రాంతంలో ఒక బాలుడు తన ఫ్రెండ్ ని పబ్ జీ ఆడటానికి ఫోన్ అడిగాడు.

17 ఏళ్ళ అతని ఫ్రెండ్ ఫోన్ ఇవ్వలేదు. దీనితో అక్కడే రాయితో కొట్టి చంపేసాడు. అయితే మృతుడి తండ్రి తన కొడుకు కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీనితో పోలీస్ సెర్చ్ పార్టీ… గాలింపు చేపట్టింది. బాధితుడు హమీద్ మృతదేహాన్ని నవంబర్ 11 న రాజ్‌సమండ్ సమీపంలోని కొండ వద్ద పోలీసులు గుర్తించారు. నవంబర్ 11 న భేర్వాలి కొండ వద్ద హమీద్ మృతదేహం కుళ్ళిన స్థితిలో కనిపించింది.

స్థానిక భీమ్ పోలీస్ స్టేషన్లో హమీద్ తండ్రి ఫిర్యాదు చేసాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, 48 గంటల్లోనే కేసును విజయవంతంగా చేధించారు. హమీద్ తండ్రి రషీద్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో, తాను, అతని భార్య రుక్మా దేవి కొడుకు పొలానికి వెళ్లామని… తాను తన భార్య వచ్చేశామని కొడుకు మాత్రం రాలేదని పేర్కొన్నాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.

దీనితో సమీప బంధువుల ఇళ్ళకు కూడా వెళ్ళారు. జిల్లా ఎస్పీ భవన్ భూషణ్ యాదవ్ ఆదేశాల మేరకు బాలుడిని గుర్తించడానికి ఎస్‌హెచ్‌ఓ గజేంద్ర సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి గాలించారు. మృతుడి మొబైల్ ఫోన్ కనపడలేదు. ఆ తర్వాత కాల్ వివరాలు సేకరించి మొబైల్ ఫోన్ గుర్తించారు. ఆ తర్వాత దర్యాప్తు చేయగా… నిందితుడు దొరికాడు.