మిడిల్ క్లాస్ మంత్రంతో దేవరకొండ తమ్ముడు ఏం చేస్తాడో?

ఆనంద్ దేవరకొండ, వర్షా బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ సినిమా మొదలైనప్పుడు ఎవ్వరికీ తెలియదు గానీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లో మిడిల్ క్లాస్ అబ్బాయిగా అటు ఆనంద్ దేవర కొండ, ఇటు వర్షా బొల్లమ్మ చాలా చక్కగా సరిపోయారు. మధ్యతరగతి జీవితాన్ని అచ్చ్చుగుద్దినట్టుగా చూపించబోతున్నారని ట్రైలర్ ని చూస్తే అర్థం అయ్యింది.

అందువల్ల మిడిల్ క్లాస్ సినిమాపై ఆసక్తితో పాటు అంచనాలు కూడా పెరిగాయి. అలాగే గుంటూరు ప్రాంత నేపథ్యంలో కథ జరుగుతుండడంతో సినిమాకి మరింత బజ్ వచ్చి చేరింది. మొదటి సినిమా దొరసానితో సరైన హిట్ అందుకోలేకపోయిన ఆనంద్, మిడిల్ క్లాస్ మంత్రంతో హిట్టు కొట్టేలా ఉన్నాడని అనుకుంటున్నారు. అటు వర్షా బొల్లమ్మకి కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ రోజు అర్థరాత్రి అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అందరి ఇళ్లలో అందుబాటులో ఉండనుంది.