విజయవాడలో ఆ కోళ్లు అమ్మేందుకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా వదిలేశాడు..!!

-

ఈ మధ్య నల్లకోడి గురించి వినే ఉంటారు. మాములు కోడిలో ఉండేదాని కంటే..అధిక పోషకాలు ఈ కోడిలో ఉంటాయి..ఇంకా దీని టేస్ట్‌ కూడా చాలా బాగుంటుంది. కాస్ట్‌ కూడా కాస్త ఎక్కువే.. ఈ కోళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ చూసి ఉద్యోగాలు వదిలేసి మరీ ఈ కోళ్లవ్యాపారం చేస్తున్నారు. ఇవి అమ్మేందుకు ఏకంగా ఓ యువకుడు సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం మానేశాడంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో మీరే చూడండి.
కడక్ నాథ్ రకానికి చెందిన కోళ్లు మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. సాధారణంగా నాటుకోళ్లు వివిధ రంగుల్లో ఉంటాయి. కడక్ నాథ్ కోళ్లకు ఈకలే కాదు శరీరం మొత్తం నలుపు రంగులోనే ఉంటుంది. మెలనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కోళ్లు నలుపు రంగులో ఉంటాయి. కడక్ నాథ్ మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. రుచి మాత్రం బాగుంటుంది. ఈ కారణంగా మాంసాహార ప్రియులు ఈ కోళ్లను ఇష్టపడుతున్నారు.
ఈ కోళ్ల మాంసం కిలో రూ. 1000 పైనే. అంటే మటన్ ధర కంటే కడక్ నాథ్ కోడి మాంసం ధరే ఎక్కువే. ఈ కోళ్లలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండటంతో పాటు ప్రొటీన్, ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కోళ్లకు వ్యాధి నిరోదక శక్తి ఎక్కువ. విజయవాడలో ఒక యువకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి… ఈ కడక్ నాథ్ కోడి అమ్మకాలపై దృష్టి పెట్టాడు… ఈ కోళ్ల అమ్మకాల ద్వారా వచ్చే లాభాలు… సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో జీతం కంటే ఎక్కువగా వస్తున్నాయట.. ప్రకృతి ఒడిలో కోళ్ళ పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు… అలాగే మరి కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు.
కడక్‌ నాథ్‌ కోళ్లకో భవిష్యత్తులో ఇంకా డిమాండ్‌ పెరుగుతుంది. బంగారు కోడి అయిపోతుంది.. ఎందుకంటే..ప్రస్తుతం వైరస్‌లో సీజన్‌ నడుస్తుంది. ప్రజలంతా ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో ఉన్నారు. కడక్‌ నాథ్‌ కోడి మాంసంలో పోషకాలు ఎక్కువ..ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కాబట్టి..డబ్బులకు ఇబ్బంది లేని వాళ్లు వెయ్యి కాదు రెండు వేలు ఇవ్వడానికైనా వెనకాడరు.. కాబట్టి..వ్యాపారం చేసే ఆలోచనలో ఉంటే..మీరు ఈ బిజినెస్‌పై దృష్టిపెట్టొచ్చు.!౧

Read more RELATED
Recommended to you

Latest news