ఏం కేసీఆర్.. దీనికి ఏం సమాధానం చెప్తావ్? – విజయశాంతి

-

పత్తి రైతులకు తగిన మద్దతు ధర ఇవ్వాలని బిజెపి తరఫున డిమాండ్ చేశారు ఆ పార్టీ నేత విజయశాంతి. ప్రభుత్వం పత్తి రైతులను అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ సర్కారుకు తెలంగాణ రైతాంగం తగిన బుద్ధి చెప్పక మానదని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు విజయశాంతి.

” దళారుల చేతుల్లో మోసపోతున్న పత్తి రైతన్నలు… ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో పత్తి రైతన్నలు వ్యాపారుల చేతుల్లో తీవ్రంగా మోసపోతున్నరు. జెండా పాట పేరుతో మద్దతు ధర కన్నా ఎక్కువ వస్తుందని అధికారులు చెబుతుండగా… తేమ పేరుతో వ్యాపారులు రేటులో కోత విధిస్తున్నరు. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నరు. కొందరికి మాత్రమే క్వింటాకు రూ.7 వేలకు పైగా రేటు చెల్లిస్తూ… మిగిలిన వారి నుంచి తేమ ఎక్కువ ఉందని చెప్పి రూ.5 వేలకే కొంటున్నరు. దీంతో అసలే దిగుబడి సరిగా లేక బాధపడుతున్న రైతులకు… కనీసం కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు.

వర్షాల వల్ల పత్తి తడిసిపోయి నల్లగా మారడం, వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు కష్టంగా మారుతోంది. ఇది ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు… తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే… ఇటు ఆఫీసర్లు గానీ, ప్రభుత్వం గానీ పత్తి రైతులను అసలు పట్టించుకోవడం లేదు. ఏం కేసీఆర్… దీనికి ఏం సమాధానం చెప్తావ్? పత్తి రైతులకు ఇప్పటికైనా తగిన మద్దతు ధర ఇవ్వాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నం. అన్నదాతలతో ఆడుకుంటున్న ఈ కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ రైతాంగం తగిన బుద్ధి చెప్పక మానదు”. అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news