ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగులకు టోకరా.. రూ.46.19లక్షల క్యాష్ తో పరార్..!

-

నిరుద్యోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిలువునా మోసం చేస్తూ.. పబ్బం గడుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి బెంగళూరుకు చెందిన మహేష్ అనే వ్యక్తి హైదరాబాద్కు చెందిన పలువురి నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశాడు.

 

యూసఫ్ గూడకు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు మహేష్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని బాధితుడితో పాటు అతడి స్నేహితుల నుంచి రూ.46.19 లక్షలు కాజేసి అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి మహేష్ ను అరెస్ట్ చేశారు. అయితే, ప్రాథమిక విచారణలో భాగంగా కళ్లు బైర్లు కమ్మే ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఇప్పటికే నిందితుడు మహేష్ పై దేశ వ్యాప్తంగా 16 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version