2017 లో 18 ఏళ్ళ అమ్మాయి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. ముందు కాపురం బాగానే సాగింది. వారం అవ్వగానే ఆమెకు సినిమా కనపడటం మొదలయింది. అంటే భర్త వేధిస్తున్నాడు అనుకున్నారా…? అత్తగారు నరకం చూపిస్తుంది అనుకున్నారా…? చిచి అవేమి లేవు. భర్త దగ్గర వాసన వస్తుంది. వాసన వస్తే ఏమవుతుంది అంటారా…? పీల్చే వాడికి గంధపు చెక్కల వాసనే,
కాని భరించే భార్యకే బయటకు చెప్పలేని నరకం. ఏమీ లేదు అండి, బాబు ఇవాళ స్నానం చేస్తే మళ్ళీ వచ్చే వారం ఈ టైం కి గాని చేయడు. ఈగలు వాలినా, చెమట వాసన వచ్చినా బాబుకి ఇబ్బంది ఉండదు. మరి భార్య ఏ విధంగా ఆ దరిద్రాన్ని భరిస్తుంది చెప్పండి. అందుకే రెండేళ్ళు పీల్చి పీల్చి, ఇక నేను పీల్చలేను అని బీహార్ మహిళా కమీషన్ ని కలిసి నాకు విడాకులు ఇప్పించమని కోరింది.
వాసన వస్తే స్నానం చేయమను, దానికి విడాకులు ఎందుకూ అన్నారు వాళ్ళు. సరే భర్తను పిలువు అనగానే, వాళ్లకు కడుపులో తెమిలి, నీ వాదన కరెక్ట్ ఏ అంటూ ఆ వ్యక్తికి సమయం ఇవ్వాలని భావించారు. అనుకున్న విధంగా అతనికి రెండు నెలల సమయం ఇచ్చారు. మారితే మారినట్టు లేదా లేనట్టు. మారకపోతే ఇక విడాకులే. అతను, తనకు భార్య కావాలని, పద్ధతి మార్చుకుంటా అని చెప్పాడు. సరే అని పంపించారు.