భారత మణిహారంగా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. ఎక్కడుందో తెలుసా!!

-

పారిస్‌లోని ఈఫిల్ టవర్ ఎంతో ఎత్తైంది. ఆ ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జిని భారత ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ అధికారికంగా వెల్లడించింది. భారతదేశంలోని చీనాబ్ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 88 శాతం నిర్మాణ పనులు పూర్తి కాగా.. త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే కశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునే విధంగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు.

రైల్వే బ్రిడ్జి
రైల్వే బ్రిడ్జి

ఈ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి దాదాపు రూ.28 వేల కోట్లు ఖర్చయింది. దీని పొడవు 1,315 మీటర్లు. ఎత్తు 359 మీటర్లు. ఈ వంతెన గంటకు 266 కి.మీ. వేగంతో కూడిన గాలిని తట్టుకునేలా నిర్మించారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇది భారతదేశంలో మొదటిసారిగా డీఆర్‌డీఓతో సంప్రదించి బ్లాస్ట్ లోడ్ కోసం రూపొందించబడింది. ఒక పీర్‌ను తొలగించిన కూడా ఈ వంతెనపై 30 కి.మీ. వేగంతో రైలును నడపొచ్చని రైల్వే శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news