వారంలో ఆయన బండారం మొత్తం బయటపెడతా: ఎర్రబెల్లి దయాకర్ రావు

-

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కడియం శ్రీహరి పార్టీ విడిచి వెళ్లడంతో బీఆర్ఎస్‌కు పట్టుకున్న దరిద్రం వదిలిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల్లో కడియం శ్రీహరి బండారం మొత్తం బయటపెడతానని ఫైర్ అయ్యారు.సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర అంతా తనకు తెలుసన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిదే గెలుపని.. తన సర్వేలు ఎప్పుడు తప్పు కాలేదని తెలిపారు. దేశంలో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఎర్రబెల్లి అన్నారు.

కాగా, ఇటీవల శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కేటాయించినప్పటికీ ,కూతురితో కలిసి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.దీంతో వరంగల్ ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ కడియం కావ్యకు ఇచ్చింది. పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ పోటీ నుండి తప్పుకుని మోసం చేసిన కావ్యను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలని బీఆర్ఎస్ నేతలు కంకణం కట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news