అవిసె గింజల్ని ఇలా ఉపయోగిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు…!

-

ఈతరం వారు ఆరోగ్యకరంగా మారేందుకు బాగా పోషకాలు ఉండేటువంటి ఆహారం తీసుకుంటున్నారు. అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలుసుకోవాలంటే దీనిని చదవండి.పెద్దలకు మాత్రమే కాదు పిల్లలకు కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దాంతో అందరూ అప్రమత్తంగా జీవిస్తున్నారు. అటువంటి ఆరోగ్యకరమైన అలవాట్లు లో భాగంగా అవిసె గింజలను కూడా మీ రోజు వారి ఆహారంలో తీసుకోండి. ఈ గింజలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ప్రస్తుతం అందరూ ఎనర్జీ బార్లను తింటున్నారు. వాటి వల్ల శక్తి పొందుతారు. వర్కౌట్స్, యోగా లాంటి శారీరక వ్యాయామాలు చేసేవారు వీటిని రోజు తింటున్నారు. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కానీ వాటిలో కూడా అతి తక్కువ మోతాదులో చక్కర ఉన్నవి మాత్రమే తినాలి. అలా అయితేనే ఆరోగ్యానికి మంచిది. ఈ ఎనర్జీ బార్లలో ఎక్కువగా అవిసె గింజలను కూడా ఉపయోగిస్తారు దాని బట్టి మీరే అర్థం చేసుకోవాలి ఇవి తినడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో.

అవిస గింజలు లో చాలా ఫైబర్ ఉంటుంది. దానివల్ల తక్కువ మోతాదులో తీసుకున్నా కడుపు నిండిపోతుంది. ఇలా చేయడం వల్ల ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోరు, కాబట్టి బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. బరువు తగ్గడమే కాదు శరీరం పనితీరు ఇంకా మెరుగు పడుతుంది.

ప్రస్తుతం చాలా మందికి గుండె సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, అటువంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే అవిసె గింజలను తీసుకుంటూ ఉండండి. దానివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు. ఇలా ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కాదు చర్మ సౌందర్యానికి మరియు జుట్టు దృఢత్వానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి.

వీటిని ఎలా ఉపయోగించాలి?

ఫ్లూయిడ్స్ లాగ తీసుకోవాలి అని అనుకుంటే నీళ్లలో అవిసె గింజల పొడిని లేదా అవిసె గింజలను వేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు అవిస గింజలు వేడి నీళ్ళలో వేసి కొంచెం ఉడికించి నిమ్మ రసం కలిపి తాగాలి. ఇలా రోజుకు ఒకసారి తాగితే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.

సలాడ్స్ లో అవిసె గింజల నూనెను వాడుకోవచ్చు. మల్టీ గ్రైన్ గోధుమ పిండి లో అవిస గింజల పొడిని కూడా కలుపుకోవచ్చు.పెరుగు మరియు అవిస గింజలు కలిపి తిసుకోవచ్చు. సాధారణంగా రోజుకు 50 గ్రాముల వరకు అవిసె గింజలను తినవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news