బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి మీద దాడి.. అసలేమైంది ?

-

ఎం.ఎల్.సి  ఎన్నికలు హింసాత్మకం గా మారాయి. మహబూబాబాద్  జిల్లా నెల్లికుదురులో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డబ్బులు పంచుతున్నారు అనే సమాచారంతో అక్కడికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మీద దాడి జరిగింది. పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని పోలీసుల ముందే ఇటుకలతో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారని అన్నారు. ప్రేమేందర్ రెడ్డి ఛాతీ భాగంలో ఇటుకలు తగిలినట్టు చెబుతున్నారు.

పరిస్థితి  ఉద్రిక్తంగా మారడంతో ప్రేమేందర్ రెడ్డిని  ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఓడిపోతామనే భయంతో దాడులు చేస్తున్నారని అని ప్రజలు వారికి బుద్ధి చెబుతారు అని అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో మా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పెర్కొన్నారు. పోలీసుల సమక్షంలో మా వాళ్ళ పై దాడి జరిగిందని  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news